న్యాయం కోసం మల్లయోధము: మల్లయోధుల నిరసన పై

ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌ యొక్కప్రక్షాళన అవసరం

June 02, 2023 11:24 am | Updated 11:24 am IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసిడెంట్ మరియు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు (మల్లయోధులు) తమ ఆందోళనను సజీవంగా ఉంచడానికి తమ ప్రణాళికలను చర్చిస్తూనే ఉన్నారు. వారి నిరసన విచారణ యొక్క సాంకేతికతపై ఇక కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ‘ప్లాటిట్యూడ్’ లో రెండు అభిప్రాయాలు ఉండకూడదు. పోక్సో (POCSO) కింద కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ రాజకీయంగా ఎలాంటి విమర్శలను ఎదుర్కోకపోవటం ప్రజాజీవితంలో నిజాయితీకి, క్రీడా పరిపాలనకు విఘాతం, ఇది కలచివేసే విషయం. మిస్టర్ సింగ్‌పై కేసులు విచారణలో ఉన్నాయని, స్టేటస్ రిపోర్ట్ కోర్టులో సమర్పించ బడుతుందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నిరపాయమైన దావా చేసిన పోలీసు బలగం తన స్వంత సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించదము తో దాని దర్యాప్తు యొక్క నిష్పాక్షికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. మంగళవారం, మల్లయోధుల కలకలం (వారిలో అంతర్జాతీయ పతక విజేతలు కూడా ఉన్నారు), వారు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేయడానికి హరిద్వార్‌లో సమావేశమైనప్పుడు భావోద్వేగ మలుపు తిరిగింది. వారు చివరి క్షణంలో వెనక్కి తగ్గారు, కానీ న్యాయం కోసం తమ మొరను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు.

ఈ నిరసనకు పౌర సమాజం నుండి మద్దతు లభించింది మరియు భారతదేశం తన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున జరిగిన మల్లయోధుల (రెజ్లర్‌ల) పై పోలీసుల అణిచివేతను ఖండించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మరియు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌తో సహా అంతర్జాతీయ క్రీడా సంస్థలు గమనించాయి. ఉత్తరప్రదేశ్ (U.P.) మరియు హర్యానాలోని జాట్ రైతు నాయకులు కూడా మల్లయోధులకు మద్దతుగా నిలిచారు, ఆందోళనను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో, మిస్టర్ సింగ్, అధికార పక్షం నుండి ఖండనలను ఎదుర్కోకుండా, దాని నాయకత్వం యొక్క ప్రోత్సాహాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. U.P.లోని కైసర్‌గంజ్‌కు చెందిన శక్తివంతమైన ఎంపీ నిరసనకారులను నిందిస్తూ తన మద్దతుదారులను సమీకరించుకుంటున్నారు. ఒకప్పుడు టాడా కేసులో నిందితుడైన మిస్టర్ సింగ్ BJP యొక్క స్కీమ్‌లో చాలా విలువైన మనిషిగా కనిపిస్తున్నాడు. విచారణ మరియు విచారణతో కూడిన తగిన ప్రక్రియ లేకుండా ఎవరినీ శిక్షించాల్సిన సందర్భం ఉండదు, కానీ చిత్తశుద్ధి అనే ప్రశ్న తప్పనిసరిగా ఉన్నత ప్రమాణాన్ని కలిగి ఉండాలి. మిస్టర్ సింగ్‌ పై వచ్చిన ఆరోపణలు ఒక ప్రతిష్టాత్మకమైన క్రీడా సంస్థకు నాయకత్వం వహించే అతని సామర్థ్యాన్ని తగ్గించే తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వీధి నిరసనల ద్వారా నేర పరిశోధన ప్రభావితం కానప్పటికీ, భారతదేశంలో లైంగిక వేధింపులను సహించేది లేదని అందరికీ, ముఖ్యంగా బాధితులు మరియు నేరస్థులకు సందేశం స్పష్టంగా ఉండాలి.

Top News Today

Comments

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.